NGKL: ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అప్పగింతలపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వరి ధాన్యాన్ని స్థానిక ఏఎంఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు కాకుండా వేరే రైస్ మిల్లుకు కేటాయించాలని రైతులు, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు నాగర్‌కర్నూల్ జిల్లా సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్‌కు బహిరంగ విజ్ఞప్తి చేశారు.