GDWL: అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కేటీ దొడ్డి మండలంలోని ఉమిత్యాల, కొండాపురం, ఇర్కిచేడు గ్రామాలలో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడు ముందు ఉండాలన్నారు.