WGL: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నల్లెబెల్లి మండల నాయకులు డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2500, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు, నిరుద్యోగులకు భృతి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల అంశాలపై మండల కేంద్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. సేకరించిన దరఖాస్తులను మే 26న MPDO కార్యాలయంలో సమర్పించాలని వారన్నారు.