BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ సభ్యులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఓ నవీన హామీతో రంగంలోకి దిగారు. ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులు ‘ముందు కోతుల సమస్య తీర్చాలి.. తర్వాత ఓట్లు అడగడానికి రావాలి’ అని పెద్ద ఫ్లెక్సీలు ఇళ్ల ముందు ఏర్పాటు చేశారు. కోతుల సమస్య తీరుస్తేనే ఓట్లు వేస్తామని అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు.