WGL: మండల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్ సత్య శారద కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఇందులో మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు పాల్గొని ఎన్నికల ఏర్పాట్ల పురోగతిని వివరించారు. ప్రతి మండలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, సామగ్రి పంపిణీ వంటి అంశాలను కలెక్టర్ ఖచ్చితంగా పరిశీలించారు.