NLG: ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల కమిటీ ఆధ్వర్యంలో, సీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలినికి శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ఆశల వివిధ డిమాండ్లపై నవంబర్ 17న జరిగే ధర్నాకు వెళ్ళుటకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాల సమస్యలపై డిఎంహెచ్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.