NLG: ఈ నెల 17న నల్లగొండ జిల్లా యాదవ బలగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని యాదవ జిల్లా నాయకుడు రామరాజు యాదవ్ పిలుపునిచ్చినారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయ ఆలయంలో సమ్మేళనకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. యాదవ సోదరులు ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.