ASF: తేమ పరీక్ష లేకుండా ఎకరానికి కనీసం 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దోత్రేకు బుధవారం రైతు సంఘం అధ్యక్షుడు మారుతీ పటేల్, BC యువజన సంఘం అధ్యక్షుడు ప్రణయ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు CCI నిబంధనలను సడలించి, కిసాన్ కపాస్ యాప్ రద్దు చేసి కొనుగోలు జరపాలన్నారు.