HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు మొదట షేక్‌పేట డివిజన్ నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత వెంగళ్రావు నగర్, రహమత్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కింపుతో పూర్తికానుంది. షేక్‌పేట్-31,182, రహమత్ నగర్-40,610, బోరబండ-29,760, ఎర్రగడ్డ-29,112 అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి.