WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా GP ఎన్నికల్లో వాట్సప్, సోషల్ మీడియా కీలక వేదికలుగా మారుతున్న నేపథ్యంలో రెచ్చగొట్టే సందేశాలు, ప్రసంగాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత గ్రూపుల పై ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించినట్టు తెలిపారు.