NLG: మాడుగులపల్లి గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ సతీమణి మేడి రవేళ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మాడుగులపల్లి GP కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రజలు తనకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు.