SRCL: వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంకు భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క-సారక్క జాతర సీజన్ ప్రారంభం కావడంతో, ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెలను కట్టి భక్తి చాటుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.