NZB: ముగ్పాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. వీరికి గుర్తులను కేటాయించారు. గ్రామంలో మొత్తం 12 వార్డులకు గాను, 11 వార్డుల్లో పోటీ నెలకొంది. 12వ వార్డు మాత్రమే ఏకగ్రీవమైంది. ఈ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,834 కాగా, అందులో పురుషులు 1,280 మంది, మహిళా ఓటర్లు 1,554 మంది ఉన్నారు.