ASF: మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని జ్ఞానేశ్వర్ మందిరంలో రాష్ట్ర, జిల్లా కమిటీల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో నూతన యూత్ కమిటీల ఏర్పాటు చేపట్టడంతో పాటు, ఆసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ డివిజన్ కమిటీలను కూడా నియమించనున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.