ASF: జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైకును గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు. అమూర్ల నవీన్ తన బైకును తన ఇంటి ఎదుట పార్క్ చేశాడు. శుక్రవారం చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో అతను చుట్టుపక్కల పరిసరాలలో వెతికాడు. అయినా బైక్ దొరకలేదు. దీంతో ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.