NZB: పట్టణంలోని 20వ బూత్ బీజేపీ అధ్యక్షుడు కేసు రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.20,000 అందజేశారు.