SRD: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 267 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మేనేజర్ విజయభాస్కర్ ఆదివారం తెలిపారు. సంగారెడ్డి-103, నారాయణఖేడ్- 112, జహీరాబాద్ 52 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.