KMM: సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు సంయుక్తంగా సర్పంచ్ అభ్యర్థిని ఇవాళ ప్రకటించాయి. ఈ రెండు పార్టీల తరఫున కొప్పుల శ్రీనివాసరావు బరిలో దిగనున్నారు. బేతపల్లిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివ వేణు, సీనియర్ నాయకులు చల్లగళ్ల నరసింహారావు ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.