HYDలోని MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి భారీగా రోగులు తరలివస్తుండటంతో ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది. వార్డులు, ఓపీ బ్లాకులు, కారిడార్లు, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా శుభ్రత పనులు నిర్వహించారు. రోగులు, వారి సహాయకులకు పరిశుభ్రమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.