PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సోమవారం గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద కొత్త 108 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ALS) వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాకు మొత్తం 8 ALS వాహనాలు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 28 మండలాలకు మొత్తం 30 వాహనాలు సేవలు అందిస్తున్నాయన్నారు.