NZB: ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.