RR: కొత్తపేట డివిజన్ న్యూ సమతాపురి కాలనీలో స్టార్మ్ వాటర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి నిల్వ, అవుట్ లెట్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.