MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసే ఎన్నికల సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.