HYD: మెహదీపట్నం పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరగడం సంచలనంగా మారింది. రైతు బజార్లో పోయిన రూ.1.75 లక్షల విలువైన ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి లాకర్లో ఉంచారు. అదే ఫోన్‌పై కన్నేసిన స్టేషన్ పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ దానిని దొంగిలించినట్లు విచారణలో బయటపడింది. సీసీటీవీ ఆధారాలు, అంతర్గత విచారణతో నిజం వెలుగులోకి రావడంతో అతడిని వెంటనే రిమాండ్‌కు తరలించారు.