NLG: MGU కామర్స్ విభాగం అధ్యాపకుడు డా. కొసనోజు రవిచంద్ర తెలంగాణలోని నూతనంగా ఏర్పాటైన నాలుగు యూనివర్సిటీల్లో మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ రీసర్చ్ స్కాలర్‌గా చేరడంతో పాటు ఐసీఎస్ఎస్ఆర్ 2024-25 ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. రవిచంద్ర పీజీఎంజీయూలోనే అభ్యసించి, తన గురువు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.కౌత శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు.