RR: హయత్నగర్ డివిజన్ మహాగాయత్రీ నగర్ కాలనీలో దాదాపు రూ.25 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు. రూ.20 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల వారీగా రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.