KMM: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తనలాంటి విద్యావంతులను గెలిపించాలని పోస్ట్ గ్రాడ్యుయేట్ జక్కుల ప్రత్యూష ఓటర్లను కోరారు. తిరుమలాయపాలెం మండలానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పొలిటికల్ సైన్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన తనకు సామాజిక, ఆర్థిక సమస్యలపై లోతైన అవగాహన ఉందని ఆమె తెలిపారు.