MNCL: బెల్లంపల్లిలో ఉన్న ఏకైక శాంతిఖని భూగర్భ గనిలో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. భూగర్భంలో రూఫ్ సపోర్డింగ్ కేబుల్ బోల్ట్స్ పనుల కారణంగా నెల రోజులుగా ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. టన్ను బొగ్గు కూడా ఉత్పత్తి జరగని ప్రతికూల పరిస్థితి ఉంది. కార్మికులు విధులకు హాజరవుతున్నా కోల్ కటింగ్ జరగక, ఉత్పత్తి నిలిచిపోవడంతో గని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.