నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బిజినేపల్లి మండలం మంగనూరులో అత్యధికంగా 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెంట్లవెల్లిలో 12.5, లింగాలలో 8.8, అచ్చంపేటలో 8.5, ఉప్పునుంతలలో 8.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల వాతావరణం చల్లబడగా ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించింది.