KMR: బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే స్కూల్లో గురువారం షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో విద్యార్థులు బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ధర్మతేజ పాఠశాలను పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.