NLG: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ తెలంగాణ NSUI ఆధ్వర్యంలో HYD ట్యాంక్ బండ్ వద్ద మషాల్ జులూస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ NSUI నాయకులు హాజరయ్యారు. లీక్ కుంభకోణం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, లీకేజీపై పారదర్శకత దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.