KMR: హైదరాబాద్లోని తన స్వగృహంలో బుధవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఏనుగు రవీందర్ రెడ్డిని కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ కామారెడ్డి జిల్లా రాజకీయాలపై చర్చించారు