MBNR: బాలానగర్ మండలంలో రేపటి నుంచి మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ ప్రారంభం కానున్నాయి. ఎలక్షన్ అధికారులు మండలంలోని 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దరేవల్లి, తిరుమలగిరి, మోతీ ఘనపూర్, గుండేడు, ఉడిత్యాల, బాలానగర్ ఎంపీడీవో కార్యాలయం, పెద్దాయపల్లి, బాలానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.