ASF: విద్యార్థులు చదువులో పురోగతి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థులను పర్యవేక్షించాలని, విద్యార్థుల పఠన సామర్ధ్యాలను పెంచాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా కృషి చేయాలన్నారు.