NGKL: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బిజినేపల్లి సహా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 7 మండలాల పరిధిలో ఉన్న 151 గ్రామాలలో ఈ విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.