KNR: బేటీ బచావో – బేటీ పడావో’, లింగ నిర్ధారణ చట్టంపై శనివారం HUZ మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షత వహించారు. పురుషులతో పోలిస్తే మహిళల శాతం తగ్గడం ఆందోళనకరమన్నారు. లింగభేదం లేకుండా సమానత్వం పాటిస్తే సమాజానికి మంచిదని, ఆడపిల్ల పుట్టినప్పుడు ఆనందంగా స్వాగతించాలన్నారు.