సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామం గత మూడు దశాబ్దాలుగా కక్షలు, రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరాటాలకు వేదికగా నిలుస్తోంది. కాలం మారుతున్నా పాత విభేదాలు కొత్త ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో జరిగిన ఘర్షణలు గ్రామ ప్రశాంతతను దెబ్బతీశాయి. తాజాగా చోటుచేసుకున్న ఘటనతో గ్రామం మరోసారి చర్చనీయాంశమైంది.