MNCL: ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, రక్తపోటును నియంత్రించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సం సందర్భంగా శుక్రవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో మధుమేహం, రక్తపోటు పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 24,430 మందిలో మధుమేహాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.