BDK: అశ్వాపురం మండలం పాములపల్లి నుంచి అక్రమంగా 3 పశువులను ఇవాళ పాల్వంచకు తరలిస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పాండురంగాపురంకి చెందిన కుర్ర హనుమాన్, బానోతు సురేష్, భూక్య సాగర్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణార్థం గోశాలకు తరలించారు.