SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలో మంగళవారం రేపాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బెజవాడ సీతారాములు గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.