WGL: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా నిలిచారు. సదస్సుకు ఆమె ఇందిరమ్మ చీరలో హాజరయ్యారు. కాగా డ్వాక్రా మహిళలకు కోటి చీరలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మహిళా ప్రతినిధులు, అధికారులు కూడా ఈ చీరలను ధరించాలని ప్రారంభోత్సవం రోజున రేవంత్ కోరారు.