నల్గొండ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ భార్య దుబ్బ రూపా బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారు. కాగా+ ఆమె కుటుంబం మానవత్వం చాటుతూ నేత్రదానం చేసింది. డాక్టర్ పుల్లారావు బృందం నేత్రాలను స్వీకరించి, మరొకరి జీవితంలో వెలుగు నింపేందుకు కృషి చేసింది. రూపా కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రముఖులతో పాటు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.