SRCL: పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. చందుర్తి మండల మల్యాల గ్రామంలో పట్టు పురుగు పెంపకాన్ని శనివారం ములుగు ఆర్ఎస్ఆర్ఎస్, సీఎస్బీ సైంటిస్ట్ సీహెడ్ డా. వినోద్ కుమార్ యాదవ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టు పురుగుల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.