MNCL: అద్దెకు ఉండే వారి పూర్తి వివరాలు తప్పనిసరిగా యజమానులు తెలుసుకోవాలని డీసీపీ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అద్దెకు వచ్చిన వారు చేసే పని, పని చేసే స్థలం తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల కోసం పెట్టుకునే కేర్ టెకర్లను గుడ్డిగా నమ్మకూడదన్నారు. కొత్తవారి, ఇతర ప్రాంతాల వారైతే వారి వివరాలు పోలీసుల దృష్టికి తేవాలన్నారు.