SRPT: ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టీలో వివరాలు నమోదు చేసుకోవాలని అనంతగిరి మండల MEO సతీష్ సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నీ దీనితోనే అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు ఆధార్ కార్డు, దానికి లింకు ఉన్న మొబైల్ ఫోన్‌తో సంబంధిత ఏఈవోలను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.