ADB: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. గ్రామాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు కావడంతో ఉదయం 10గంటల తర్వాతనే ప్రజలు బయటకు వస్తున్నారు. సాయంత్రం వేళలో ప్రభావం లేక పోగా మూడు రోజుల నుంచి ఒక్కసారిగా చలి పెరగడంతో ఏజెన్సీ వాసులు, వ్యాపారులు వణికిపోతున్నారు.