RR: జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. షాద్నగర్ పట్టణంలో ఈరోజు దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 8 దాటినా పొగ మంచు తగ్గకపోవడంతో రోడ్లపై వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతుండటంతో ప్రజలు చలికి వణికి పోతున్నారు.