KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొణిజర్ల మండలంలోని సమస్యాత్మక గ్రామలైన రాజ్యతండ, అమ్మపాలెం గ్రామాల్లో శనివారం రాత్రి పోలీస్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కొణిజర్ల ఎస్సై సూరజ్ అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తూ బైండోవర్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.