WGL: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ నాన్-ప్రొఫెషనల్ కోర్సుల ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. రెగ్యులర్, ఇంప్రూవ్మెంట్ విద్యార్థులకు జూన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. జూన్ 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.