BHPL: చిట్యాల మండలంలో నిన్న రాత్రి VCK రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, BRS, BJPలు మద్యం-డబ్బును విచ్చలవిడిగా పంచుతూ.. ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లు డబ్బు-మద్యానికి ఓటు అమ్ముకోకూడదని, అక్రమాలు జరిగితే ప్రతి పౌరుడు అధికారులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.